YSR Sunna vaddi Scheme Full Details




YSR Sunna vaddi Scheme - వై.యస్.ఆర్ "సున్నా" వడ్డీ పథకం :-

Note

 జులై 26 న జరగవలసిన వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత ప్రారంభ కార్యక్రమం అమలాపురంలో అధిక మోతాదు వర్షాల వలన వాయిదా వేయడం జరిగినది. కొత్త తేదీని త్వరలో అప్డేట్ చేయడం జరుగును.

సున్నా వడ్డీ లోన్ వివరాలు , SHG Group , అర్హత వివరాలు చెక్ చేయండి 👇🏿👇🏿
YSR Sunna vaddi Scheme - వై.యస్.ఆర్ "సున్నా" వడ్డీ పథకం

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకొన్న ఋణాలను సక్రమముగా తిరిగి చెల్లించుటకు, వారి పై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వడ్డీ రాయితీ పథకాన్ని "వై.యస్.ఆర్ సున్నా వడ్డీ " గా అమలుచేస్తున్నారు.

ఈ పథకం అమలు వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా మరింత రుణం పొందడానికి మరియు వారు స్థాపించిన చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా, వడ్డీ భారం లేకుండా నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికి దోహద పడుతుంది.


ప్రయోజనం :-


❒︎ అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘమునకు రూ.3,00,000 /- లక్షల ఉప్పు నిల్వ వరకు పూర్తి వడ్డీ ప్రయోజనం చేకూరుతుంది .

అర్హతలు :-


❒︎ తేది.11.04.2019 నాటికి అప్పు నిల్వ ఉన్న స్వయం సహాయక సంఘాలు మరియు 11.04.2019 నుండి కొత్తగా ఋణం పొంది క్రమం తప్పకుండా ఋణ చెల్లింపులు చేస్తున్న స్వయం సహాయక సంఘాలు "సున్నా” వడ్డీకి అర్హులు.

❒︎ క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా అప్పు పొందిన సంఘాలు నెలాఖరునాటికి ఉన్న అప్పు నిల్వలో కనీసం 3 శాతం మరుసటి నెలాఖరు లోపు చెల్లించాలి.

ఉదా : తేది 31.07. 2019 నాటికి ఉన్న బ్యాంకు అప్పు నిల్వ మొత్తం. రూ.3,00,000/-, పూర్తి వడ్డీ రాయితీ పొందడానికి కనీసం కట్టవలసిన 3 శాతం అంటే రూ.9,000/- 31.08.2019 నాటికీ పూర్తిగా చెల్లించాలి.


❒︎ టర్మ్ లోన్ ద్వారా తీసుకొన్న ఋణము నెల వారి వాయిదా మొత్తంను కట్టవలసిన నెలాఖరునాటికి కట్టవలెను.

ఉదా: తేది 05.07.2019 న అప్పు తీసుకొన్నట్లు అయితే నెలవారీ వాయిదా 05.08.2019 నాటికి కట్టవలసి ఉంటుంది. అయితే 31.08.2019 నాటికి కట్టినా పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తుంది.

❒︎ వడ్డీ లేని ఋణ అర్హతను ప్రతినెల లెక్కించ బడుతుంది.

❒︎ వాయిదా బకాయి ఉన్న సంఘాలు బకాయిలు పూర్తిగా చెల్లించిన పిదప మాత్రమే వడ్డీ లేని ఋణాల కు అర్హత పొందుతాయి. ఏ నెలలో అయితే బకాయిలు పూర్తిగా చేల్లిస్తారో ఆ నెలకు మాత్రమే వడ్డీ లేని ఋణం పొందుతారు.

❒︎  ప్రస్తుత అప్పు నిల్వ, అప్పు మంజురుయిన మొత్తంనకు సమానంగా గాని లేక తక్కువగా గాని ఉన్న సంఘాలు అర్హత పొందుతాయి.

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel